చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వాసనీయ సమాచారం మేరకు ఆదివారం బాలానగర్ ఎస్ ఓటీ, చందానగర్ పోలీసులు తనిఖీ నిర్వహించి ఒడిశా నుండి రాష్ట్రానికి కారులో తరలిస్తున్న 57 కిలోల గంజాయి గుర్తించినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరొక నిందితుడు పరారైనట్లు పేర్కొన్నారు. గతంలో హర్యానాలోనూ నిందితులపై కేసులు నమోదైనట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.