ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ లో బాయ్స్ ఉపాధ్యాయులు విధులు నిర్వహించకూడదని, తెలంగాణ దండోరా, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోస్ ను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ దండోరా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.
ప్రభుత్వ బాలికల గురుకులలో బాయ్స్ ఉపాధ్యాయులను, బాయ్స్ గురుకుల హాస్టల్ కు బదిలీలు చేయాలని మీసాల రాము మాదిగ అధికారులను కోరారు. బాలికల హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న బాయ్స్ ఉపాధ్యాయులు రాత్రి సమయంలో కూడా హాస్టల్లోనే ఉండడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఉదాహరణకు నాగర్ కర్నూల్ జిల్లా మున్ననూరు ప్రభుత్వ గురుకుల బాలికల హాస్టల్ లో అమ్మాయి చనిపోవడనికి కారణం కూడా ఇదే సందర్భమని మరొకసారి గుర్తు చేశారు. పాఠశాలలు ఈనెల 12న ప్రారంభం అవుతాయని, అంతకుముందే బాలికల గురుకుల పాఠశాలలో ఉండే బాయ్స్ ఉపాధ్యాయులను, గురుకుల బాయ్స్ హాస్టల్ కు బదిలీలు చేయాలని, మీసాల రాము మాదిగ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా డిసీఓ, రాష్ట్ర గురుకుల సెక్రటరీ ఆఫీస్ లను ముట్టడి చేస్తామని మీసాల రాము మాదిగ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి మంతటి గోపి మాదిగ, తెలంగాణ దండోరా చిన్నంబావి మండల అధ్యక్షులు బచ్చలకూర స్వామి మాదిగ, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు వడ్డేమాన్ నరసింహ, కార్యదర్శి డప్పు మధు, కోశాధికారి జ్యోతి, మహిళ నాయకులు శ్రావణి, స్వాతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.