ధరణి పోర్టల్‌లోని నిషేధిత అసైడ్ భూముల జాబితా నుండి పట్టా భూములను తొలగించాలని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం హాజీపల్లి గ్రామంలో బాధిత రైతుల పట్టాపాసు పుస్తకాలను తిరిగి జారీచేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని హాజీ పల్లి గ్రామస్తులు, రైతులు కోరారు. సోమవారం నిషేధిత భూములుగా వర్గీకరించబడిన హాజీపల్లి గ్రామ రైతుల భూములకు సంబంధించిన సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవచ్చారు.