తెలంగాణ విద్యా శాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ ముందు 12 రోజులుగా చేపట్టిన దీక్ష శిబిరాన్ని బుధవారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నేత పానుగంటి పర్వతాలు సందర్శించి సంఘీభావం తెలియజేసారు. వినతిపత్రంను రాష్ట్ర ప్రభుత్వానికి నివేధించాలని ఇవ్వడం జరిగింది.