అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించి విద్యారంగాన్ని తీర్చిదిద్దే దిశగా గురిపెట్టు అంటూ ప్రొఫెసర్ హరగోపాల్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించారు. నూతనంగా నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు చేరుకున్న ప్రోఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే శంకర్ ఎంతో కృషి పట్టుదలతో తను చదివిన కళాశాలను పూర్ణ నిర్మాణం చేసి తన పేరు నిలిచిపోయేలా చేసుకున్నారని అభినందించారు.