క్రీడలకు పుట్టినిల్లు పల్లెటూర్లు అని ఏ క్రీడ మొదలైన ముందుగా పల్లెటూర్లలోనే పుడుతుందని షాద్ నగర్ బీఆర్ఎస్ యువనేత, మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ అన్నారు. కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో క్రికెట్ టోర్నమెంటును శనివారం బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ లంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యాచ్ కు ముందు రవీందర్ యాదవ్ బ్యాటింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు.