డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మందు బాబు హల్చల్
చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నయీముద్దీన్, ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అక్కడ ఆటోను ఆపేందుకు పోలీసులు యత్నించారు. అతడు ఆపకుండా అడ్డంగా ఉన్న పోలీసుల పైకి తీసుకు వెళ్ళే విధంగా ముందుకు సాగాడు. ఆటోను అపి పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్దారణ అయ్యింది. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చివరకు పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.