ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొడాలి నానికి ఊరట లభించింది. విశాఖలో నమోదైన కేసును రద్దు చేయాలని కొడాలి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కొడాలిపై పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో కొడాలి నానికి భారీ ఊరట కలిగింది.