SLBC టన్నెల్‌లో 43వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. స్పెషల్ IAS అధికారి శివశంకర్ పర్యవేక్షణలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రతిరోజూ 20 మీటర్ల మేర TBM శిథిలాలు తొలగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 30 మీటర్ల దూరంలో డేంజర్ జోన్‌గా కంచె ఏర్పాటు చేశారు. భారీ మోటార్లతో ఊట నీటిని బయటకు పంపే పనులు జరుగుతున్నాయి. లేజర్, ప్లాస్మా కట్టర్లతో ఇనుప శిథిలాలను సిబ్బంది కట్ చేస్తున్నారు.