
జైలుకు వెళ్లడానికి జగన్ వంతు త్వరలో వస్తుంది: MLA జ్యోతుల
AP: లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లడానికి జగన్ వంతు త్వరలో వస్తుందని జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు. ఆదివారం జగ్గంపేట స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాంలో ఒక్కొకరుగా బయటకు వస్తున్నారని.. అది తట్టుకోలేక సీఎం చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం నయవంచకుడని అన్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత నరసింహంకు లేదన్నారు.