అందోల్: బీసీ కులగణన, బీసీ కమిషన్ బహిరంగ విచారణ సందర్భంగా కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులకు ముదిరాజ్ కులం తరపున వినతి పత్రాన్ని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి నారాయణ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిరాజ్ కులాన్ని బీసీ డి గ్రూప్ నుండి బీసీ ఎ గ్రూపుకు మార్చాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ముదిరాజ్ లను బీసీ ఎ గ్రుపులోనికి మార్చిన జీవో ను వెంటనే అమలు చేయాలని కోరారు.