రఘోత్తంపల్లి లో ఉచిత దంత వైద్య శిభిరం
దుబ్బాక మండల పరిధిలోని రఘోత్తంపల్లి గ్రామంలో మంగళవారం తెలంగాణ సుపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల సిద్దిపేట ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిభిరం నిర్వహించినట్లు డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు దంత సమస్యలపై అవగాహన కల్పించి, 150 మందికి పుచ్చ పళ్లు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు.