జర్నలిస్టుల వివరాలను ఈనెల 15వ తేదీ వరకు సేకరిస్తామని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్నారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు.