నారాయణఖేడ్ మండలం వెంకటాపురం చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, తదితరులు ఉన్నారు.