సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో డివిజన్లో 90 రోజుల వరకు డ్రైనేజీ పైప్ లైన్ లో చెత్త చెదారం తొలగించడానికి జలమండలి విభాగం ద్వారా డిసిల్టింగ్ కార్యక్రమాన్ని గురువారం రామచంద్రపురం కార్పొరేటర్ బూరగడ్డ పుష్పా నగేష్ స్థానిక వర్తక సంఘం నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ అభిషేక్, వర్తక సంఘ నాయకులు తదితరులు ఉన్నారు.