భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను తయారు చేయాలని కోరారు. నష్టపోయిన రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.