జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే సీపీఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సదాశివపేట ఏరియా కార్యదర్శి ప్రవీణ్ కోరారు. సదాశివపేటలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలో ప్రజా సమస్యలపై చర్చించి దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.