సంగారెడ్డిలోని ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో టైలరింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన 18 నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలు అర్హులని చెప్పారు. రేషన్, ఆధార్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు, నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.