కొత్తగా చేరిన కానిస్టేబుల్ క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అదనపు ఎస్పీ సంజీవరావు అన్నారు. సంగారెడ్డి పోలీస్ పరిధి మైదానంలో శనివారం వీక్లీ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ ఎప్పుడు శారీరకంగా ఫిట్ నెస్ గా ఉండాలని చెప్పారు. ఎలాంటి విధులైన సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.