సంగారెడ్డి: లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు

75చూసినవారు
సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని లక్ష్మీ గణపతి ఆలయంలో సోమవారం రాత్రి సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు గణపతికి మహా అభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో గణపతిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్