జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఆటో డ్రైవర్ లకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించినట్లు పట్టణ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ తెలిపారు. వాహన చోదకులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పరిమిత వేగంతో వాహనాలను నడపాలని సూచించారు.