ఔరంగజేబ్ తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా1తో.. సర్వాయి పాపన్న సంప్రదింపులు జరిపి తనను రాజుగా గుర్తిస్తే.. కప్పం కట్టడానికి తాను సిద్ధమని నమ్మించి రాజ ముద్ర వేయించుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీ మొఘల్స్ మధ్య అధికార పోరుతో బలహీన పడ్డ పాలనను చూసి, పాపన్న గోల్కొండను ఆక్రమించాడు. తక్కువ కులం వాడు రాజుగా ఉండటం జీర్ణించుకోలేని వంశపారంపర్య జమీందారులు, ఇతర ప్రాంతాల ఫోయూజిదారులందరూ కలిసి గోల్కొండను దిగ్బంధించారు.