పండు రంగుమారి, బాగా ఎండిన వంకాయలను ఎంచుకోవాలి. ముదురాకుపచ్చ నుంచి లేత గోధుమ రంగులోకి మారిన పండ్లను కాడతో సహా కోసుకుని ఒక వారం రోజుల పాటు నిల్వ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా మారిన తర్వాత విత్తన సేకరణకు ఉపయోగించుకోవాలి. వంగలో తడి, పొడి పద్ధతిలో విత్తనాన్ని సేకరించుకోవచ్చు. విత్తన దిగుబడి ఎకరాకు 48-100 కిలోల దాకా ఉంటుంది.