దుబ్బాక: ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మాక్ ఎలక్షన్

62చూసినవారు
దుబ్బాక: ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మాక్ ఎలక్షన్
దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట వార్డ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంగళవారం ఉపాధ్యాయులైన కాల్వ శ్రీకాంత్, భోగ నరేష్ ఆధ్వర్యంలో మాక్ ఎలక్షన్ ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ సాదత్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు మాక్ ఎలక్షన్స్ అనేవి ప్రజాస్వామ్య విధానం, భారత రాజ్యాంగం పట్ల ప్రత్యక్ష అనుభవాలు ఏర్పడతాయన్నారు.

సంబంధిత పోస్ట్