సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల వ్యాప్తంగా సోమవారం కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కుదేలయ్యారు. కోసిన ధాన్యాన్ని బీట్లలో ఎండపోస్తే వర్షార్పణం అవ్వడం, అలాగే కోయకుండా చేనులో ఉన్న వరిపంటలు కూడా వడ్లు రాలిపోవడంతో అన్నదాత ఆశలు ఆవిరి అయ్యాయి. తడిసిన ధాన్యం, పాడైన వరి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.