సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం అభయ హస్తం మిత్ర బృందం గౌరవ అధ్యక్షులు నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి బిక్షపతి, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల యువజన విభాగం అధ్యక్షులు గౌరీ శంకర్, సీనియర్ నాయకులు భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.