కొండపాక: ఆర్థికంగా ఆదుకోవడమే సిఎంఆర్ఎఫ్ లక్ష్యం
అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ పని చేస్తుందని బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ అన్నారు. దుద్దెడ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, దుద్దేడ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ తో కలిసి ఆరుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.