సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో మల్లెచెట్టు చౌరస్తా సమీపంలో మంగళవారం ఉదయం విద్యుత్తు స్తంభం విరిగి దగ్గరలో ఉన్న స్కూటీ వాహనంపై పడింది. ఈ ప్రమాదంలో స్కూటీ ధ్వంసం అయింది. జాతీయ రహదారుల పనుల్లో భాగంగా పాతిన విద్యుత్తు స్తంభం నిన్న కురిసిన వర్షాలకు తుప్పు పట్టినట్లే విరిగింది. ప్రమాద స్థలంలో ఎవ్వరు లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింనట్లైంది.