ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నేడు మంగళవారం నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ భవనం నుంచి గాంధీచౌరస్తా వరకు జరిగే ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలోను, మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు.