పట్టా పగలే అంగన్వాడీ టీచర్ ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన సంగారెడ్డి పట్టణం దెగుల్వాడి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దెగుల్వాడిలో అంగన్వాడీ టీచర్ రమాదేవి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు. పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో ఉన్న ఒక లక్ష రూపాయలు, ఐదు తులాల బంగారం దొంగిలించారని బాధితులు తెలిపారు. ఇంట్లోని వస్తువులు మొత్తం చిందరవందరగా చేసి వెళ్లిపోయారని అన్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.