సిద్దిపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు యాదవ రెడ్డి 60 ఏళ్ల వయసులో శబరిమల పాదయాత్ర పూర్తి చేయడం గొప్ప విషయమని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగాచారి అన్నారు. సిద్దిపేట నుండి శబరిమల వరకు పాదయాత్రగా వెళ్లిన యాదవ రెడ్డి పాదయాత్ర ముగించుకుని సోమవారం సాయంత్రం సిద్దిపేటకు చేరుకున్నారు. సిద్దిపేటకు వచ్చిన ఆయనకు జర్నలిస్టు నాయకులు ఘన స్వాగతం పలికి, ప్రెస్ క్లబ్లో శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.