స్వామి పిలిచాడు.. అందుకే చనిపోతున్నా

2692చూసినవారు
స్వామి పిలిచాడు.. అందుకే చనిపోతున్నా
వివాహం కాలేదని తీవ్ర మనస్తాపంతో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఉరేసుకుని చనిపోయిన ఘటన హైద‌రాబాద్‌లోని కవాడిగూడలో జరిగింది. మృతుడు సిద్దిపేట తాళ్లబస్తీకి చెందిన గోపాల్ గుర్తించారు. అతడి రూమ్‌లో ఓ సూసైడ్ లెటర్ లభించిందని పోలీసులు తెలిపారు. అందులో 'ఆంజనేయస్వామి పిలిచాడు.. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా' అని రాసి ఉందన్నారు. కాగా ఇటీవలే తన తమ్ముడికి పెళ్లి జరగడంతో గోపాల్ కుమిలిపోయేవాడని బంధువులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్