ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా, భక్తులు ఉదయం నుండే తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించారు.