తెలంగాణ వైద్య మండలి సభ్యుడు రాజకుమార్ ఆధ్వర్యంలో వైద్య బృందం శనివారం గంగాధర మండలంతోపాటు కొత్తపల్లి పట్టణంలోని పలు క్లీనిక్‌లపై దాడులు చేసింది. పదో తరగతి, చదువు మధ్యలో మానేసిన వారు వైద్య వృత్తిలోకి వచ్చినట్టు గుర్తించింది.
ఈ మేరకు గంగాధరలోని రాము సహస్ర క్ల్లీనిక్, మల్లేశం మహేశ్వర మెడికల్స్, యాదగిరి సంపత్ క్ల్లీనిక్ అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్నట్టు గుర్తించింది. క్లీనిక్‌లను సీజ్ చేసింది.