సత్యనారాయణ స్వామి వ్రతంలో మంత్రి దంపతులు
హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్తీకమాసం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకున్నారు. సతీసమేతంగా సత్యదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు పొన్నం దంపతులకు తీర్థప్రసాదాలు అందించి, వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.