ఫిర్యాదు మేరకే సోదాలు: మంత్రి
జన్వాడ ఫామ్ హోస్లో సోదాలు చేయాలని సీఎం చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము ఎవ్వరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదని అన్నారు. బుకాయిస్తే తప్పు ఒప్పు కాదన్నారు. ఫిర్యాదు వస్తేనే పోలీసులు సోదాలు చేశారని వెల్లడించారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.