సెయింట్ పాల్స్ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

651చూసినవారు
సెయింట్ పాల్స్ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
కరీంనగర్ పట్టణంలోని స్థానిక వావిలాల పల్లి లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో విజ్ఞాన శాస్త్రవేత్త " సర్ సి. వి. రామన్ జన్మదినం పురస్కరించుకొని డైరెక్టర్ రాజు కుమార్ మరియు ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని ఆధ్వర్యంలో విధ్యార్థులు సైన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పధం పెరుగుతుందని , వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సరి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గోని 150 మోడల్స్ తయారుచేసి ప్రదర్శించారు అన్నారు. విద్యార్థులు తయారు చేసిన భౌతిక, రసాయన , జీవ శాస్త్ర ప్రదర్శనలు అందరిని ఆలరించాయి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గోని విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్