సెయింట్ పాల్స్ పాఠశాల లో గణిత దినోత్సవ వేడుకలు

987చూసినవారు
సెయింట్ పాల్స్ పాఠశాల లో గణిత దినోత్సవ వేడుకలు
వావిలాల పల్లె లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు 100 రకాల మోడల్స్ మరియు ప్రాజెక్ట్స్ లు ప్రదర్శించారు. నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ గణితం లేనిదే జీవితం లేదని ప్రాజెక్ట్స్ ల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు తో పాటు అన్ని రంగాలలో ముందు ఉంచేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం అన్నారు. గణిత శాస్త్రం ఉపాద్యాయులు పర్వీన్, మరియు శ్రీనివాస్ విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను వివరిస్తూ సమస్యల ను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. గణితాన్ని ఇష్టపడితే కష్టం లేకుండా నేర్చుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపల్ లీనా, ప్రియదర్శిని, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్