కరీంనగర్ పట్టణంలో వాసవి వనిత క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. క్లబ్ అధ్యక్షురాలు రాచమల్ల గాయత్రి ఆధ్వర్యంలో స్థానిక కన్యక పరమేశ్వరి ఆలయం వేదికగా శనివారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ యాదగిరి అరుణ మరియు 36 వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ విచ్చేశారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ ఆట పాటల పోటీలు, తంబోలా మరియు లక్కీ ఉమెన్ నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ మాధవి, పబ్బ అరుణ, రీజినల్ చైర్ పర్సన్ జైన అర్చన, జోన్ చైర్ పర్సన్ సూర గీత, ప్రధాన కార్యదర్శి సురస, కోశాధికారి శాలిన క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.