అఖిల భారత జాతీయ ఓబిసి 9వ మహసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. గురువారం మంథని పట్టణంలోని రాజాగృహలో పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లోని ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ హల్ లో నిర్వహించే అఖిల భారత జాతీయ ఓబిసి 9వ మహాసభ- ఛలో అమృత్ సర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రాంకుమార్ పాల్గొన్నారు.