వరంగల్- మంచిర్యాల జాతీయ రహదారి ఎన్ హెచ్ 163 జీ నిర్మాణానికి సేకరించిన భూములలో ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేసి జాతీయ రహదారి ఆథారిటి అప్పగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం మంథని మండలం కన్నాల, పందులపెల్లి గ్రామాలలో ట్రెంచ్ కటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూములలో ట్రెంచ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మంథని తహసిల్దార్ రాజయ్య ఉన్నారు.