భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్

71చూసినవారు
భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్
భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఓదెల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు, భూసేకరణ, సర్టిఫికెట్ల జారీ అంశాలపై రివ్యూ నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటారు. సమావేశంలో తహసిల్దార్ యాకన్న, డీటీ అనిల్ కుమార్, ఎంపిఎస్ఓ మల్లేశ్, ఆర్ఐ రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్