రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ మార్కెట్లో చైర్ పర్సన్ సాబేరా బేగం సోమవారం మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కండ్లలో ఆనందాన్ని చూస్తున్నామని అన్నారు.