నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి ఆరు తులాల బంగారం చోరీ (వీడియో)

75చూసినవారు
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఇప్పపల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న ఏనుకంటి నరసమ్మ అనే మహిళ మెడలో నుంచి ఆరు తులాల బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు దొచుకొని పరారయ్యారు. ఆరు తులాల్లో మూడు తులాల పుస్తెలతాడు, మరో మూడు తులాల నెక్లెస్‌ ఉంది. ఈ క్రమంలోనే నరసమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి హైదరాబాద్ తరలించారు.

సంబంధిత పోస్ట్