హైదరాబాద్‌లో నేడు ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది. సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ మేరకు పోలీసులు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్రను డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు కోరుతున్నారు.