తెలంగాణ వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మమహోత్సవాన్ని నిర్వహించారు. సీతారాములు స్వయంగా వెలిసిన భద్రాచలంలో కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. రాష్ట్రంలోని యాదాద్రి, స్వర్ణగిరి, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు, బాసర సరస్వతి, కీసరగుట్ట, తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీ జానకీరాముల కల్యాణ క్రతువును పండితులు ఘనంగా నిర్వహించారు.