హాలీవుడ్ గాయని జెస్సికా సింప్సన్ తన గాత్ర నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి పాము వీర్యం కలిగిన చైనీస్ హెర్బల్ డ్రింక్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమె తన వాయిస్ కోచ్ సూచన మేరకు ఈ డ్రింక్‌ను తీసుకున్నట్లు తెలిపారు. దీన్ని గూగుల్‌లో పరిశీలించినప్పుడు, ఇందులో పాము వీర్యం ఉన్నట్లు తెలిసిందని, ఇది తేనె వంటి రుచిని కలిగి ఉందని ఆమె వివరించారు.