అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకు సాగుతోంది: TPCC చీఫ్

83చూసినవారు
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకు సాగుతోంది: TPCC చీఫ్
అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ ముందుకు సాగుతోందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 'మనం పండిస్తున్న సన్నబియ్యం ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తున్నాం. విద్య పరంగా చాలా ఆలోచనలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధి, సోనియమ్మ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పటిష్టతతో ఉంది' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్