తెలంగాణ ప్రజలు ఆదివారం నాడు మందు, మాంసానికి దూరంగా ఉంటే బ్రహ్మాండంగా ఉండబోతోందని ప్రముఖ సిద్ధాంతి బాచంపల్లి సంతోశ్ కుమార్ పంచాంగ శ్రవణంలో చెప్పారు. 'సుక్క ముక్కకు దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటుంది. భగవంతుడు అనుగ్రహిస్తాడు. పరిపాలన సవ్యంగా జరగాలంటే ఆదివారం ఈ నియమాన్ని పాలకులు, అధికారులు, ప్రజలు పాటించాలి. సూర్యనమస్కారాలు చేసిన వ్యక్తి శక్తిమంతుడు అవుతాడు' అని వివరించారు.