AP: పిఠాపురంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ షాన్ మోహన్‌కు అన్నా క్యాంటీన్ బిల్లుల కోసం ఫిర్యాదు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ సురవరపు దివానం వచ్చారు. పని చేసి ఏడు నెలలైనా బిల్లులు రావడం లేదంటూ కలెక్టర్‌ను కాంట్రాక్టర్ నిలదీశారు. ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా బిల్లులు రావడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల ముందే కలెక్టర్‌ను కాంట్రాక్టర్ తిట్టారు.